అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేసీఐ ఇందూరు, అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలనీలో మహిళలకు వివిధ రకాల  ఆటలు  నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు పెండోటి గౌతమి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని అన్నారు. తాను కూడా ఒక గృహిణి అని,  సమాజ సేవ చేసే అవకాశం తనకు జేసీఐ ఇందుర్ ద్వారా అధ్యక్షురాలిగా లభించిందని, ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం చేద్దామని...