Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 4:26 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేసీఐ ఇందూరు, అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలనీలో మహిళలకు వివిధ రకాల  ఆటలు  నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు పెండోటి గౌతమి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని అన్నారు. తాను కూడా ఒక గృహిణి అని,  సమాజ సేవ చేసే అవకాశం తనకు జేసీఐ ఇందుర్ ద్వారా అధ్యక్షురాలిగా లభించిందని, ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి జైపాల్ కాలే, అలుమ్ని క్లబ్ కోఆర్డినేటర్ లావణ్య, జోన్ అధికారి నయన్, పూర్వ  అధ్యక్షులు యదేశ్ గౌడ్, జెసిఐ సభ్యులు సుకన్య, లీల, రమాదేవి, రమ్య, వీణ, కాలనీ మహిళలు పాల్గొన్నారు.

International Women's Day