Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 7:15 pm Posted by : ramakrishna

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగర మేయర్ ఉమారాణి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. అధ్యక్ష కార్యదర్శులు శశికాంత్ కులకర్ణి, రమేష్ కులకర్ణి మాట్లాడుతూ మహిళలు రాజకీయ, విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు కిరణ్ దేశ్ ముఖ్, మిలింద్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, కొలవి విజయ్ కుమార్, కోస్లీ చంద్రశేఖర్, సౌమ్య భరద్వాజ్, సంధ్యా కులకర్ణి, శైలజా దేశ్ ముఖ్, గీతా, నాలం రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు.