Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 8:42 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లో గల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరికీ ధ్యానం చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ ధ్యానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు. ధ్యానం చేయడం వల్ల ద్వారా శారీరిక మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ధ్యానం వల్ల ఏకాగ్రత, ఒత్తిడి తగ్గుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది ,మైండ్ కూల్ గా కామ్ గా ఉంటుందని అన్నారు. పక్షవాతం వంటి వ్యాధులను కూడా ధ్యానం ద్వారా నయం చేసుకోవచ్చని  తెలిపారు.
అందుచేత ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరారు. నిజాంసాగర్ గవర్నమెంట్ యునాని హాస్పిటల్ లో కేంద్ర ప్రభుత్వం యోగా శిక్షకులు నియమించారు. నిజాంసాగర్ యునాని హాస్పిటల్ లో యోగా శిక్షకులు బీర్ సింగ్, అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం, యోగా చేయడం ఈ అవకాశాన్ని నిజాంసాగర్ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు.