Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 6:20 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ మానవ కర్తవ్య దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జెసిఐ వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు  అంతర్జాతీయ మానవ కర్తవ్య దినోత్సవం సందర్భంగా విఎన్‌ఆర్ పబ్లిక్ స్కూల్ లో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సమాజంపై మానవ కర్తవ్యాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ అధ్యక్షులు చంద్రశేఖర్, యాదేష్ ప్రధాన అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానవ హక్కులతో పాటు మానవ కర్తవ్యాలను గుర్తించి ఆచరించడం వ్యక్తి, సమాజం, దేశ ప్రగతికి అత్యంత అవసరమని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులు ఈ కార్యక్రమాన్ని అభినందించి, కర్తవ్యనిబద్ధత, శ్రద్ధ, బాధ్యతా భావంతో జీవించాలని ప్రతిజ్ఞ చేశారు.