అంతర్జాతీయ చాయ్ దినోత్సవం
ఆర్మూర్, బతుకమ్మ : అంతర్జాతీయ చాయ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ లో వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కలిసి చాయ్ త్రాగుతూ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి మాట్లాడుతూ చాయ్ అనేది నిత్యజీవితంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం వరకు అనేక మార్లు చాయ్ సేవనం జరుగుతుందని, తద్వారా మానసిక ప్రశాంతత,ఆనందం లభిస్తుందని అన్నారు....