Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 3:46 pm Posted by : ramakrishna

అంతర్జాతీయ చాయ్ దినోత్సవం

ఆర్మూర్, బతుకమ్మ :  అంతర్జాతీయ చాయ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ లో వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కలిసి చాయ్ త్రాగుతూ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి మాట్లాడుతూ చాయ్ అనేది నిత్యజీవితంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం వరకు అనేక మార్లు చాయ్ సేవనం జరుగుతుందని, తద్వారా మానసిక ప్రశాంతత,ఆనందం లభిస్తుందని అన్నారు. అదేవిధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వున్న చాయ్ ద్వారా అట్టి సమస్యలను నివారించుకోవచ్చు అని చాయ్ అనేది ఒక ఎనర్జీ అనికూడా చెప్పుకోవడం జరుగుతుందని తెలిపారు. నాడు బ్రిటిష్ పరిపాలనలో మధ్యాన భోజనం తరువాత చాయ్ త్రాగడం తప్పనిసరిగా వారి నిత్య జీవనంలో రివాజుగా ఆంగ్లేయులు పాటించేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు జేస్సు అనంద్, సర్వసమాజ్ కార్యదర్శి కర్తన్ దినేష్,క్షత్రియ సమాజ్ జాయింట్ కార్యదర్శి సంతాని విజయ్, జిజి ఫౌండేషన్ కార్యదర్శి బెల్దారి శ్రీనివాస్, సర్వసమాజ్ మాజీ అధ్యక్షులు మహేష్, జి జి ఫౌండేషన్ ప్రతినిధులు డీజే సంజయ్,డీజే,సునీల్,విశ్వనాథ్ రంగా తదితరులు పాల్గొన్నారు.