బిచ్కుంద, బతుకమ్మ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో గురువారం వచ్చిన ఫిర్యాదు ప్రకారం గురుకుల మైనార్టీ స్కూల్లో పరీక్ష రాసి కనిపించకుండా పోయిన బాలుడి విషయమై మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తెలియజేశారు. శుక్రవారం ఉదయం చిన్న దడ్గి నుంచి పెద్ద దడ్గి వెళ్లే మార్గంలో ఉన్న నాలాలో ఒక మగ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్టు సమాచారం అందగా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, అది గురువారం కనిపించకుండా పోయిన అదే మైనారిటీ గురుకుల పాఠశాల బాలుడి మృతదేహమని విచారణలో తేలిందని ఆయనన్నారు. ప్రాథమిక విచారణ దర్యాప్తు ప్రకారంగా ఈ నెల 5వ తేదీన బాలుడు పరీక్ష రాసిన తర్వాత పరీక్ష సరిగా రాయకపోయాననే మనస్థాపానికి గురై తిరిగి కళాశాలకు వెళ్లకుండా నడుచుకుంటూ చిన్న దడ్గి వెళ్లే మార్గంలో ఉన్న కౌలాస్ నాలాలో దూకి, ఊపిరాడక మృతి చెందినట్టు తెలియబడుతోందని బిచ్కుంద ఎస్సై తెలియజేశారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని పూర్తి దర్యాప్తును కొనసాగించి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు.
