Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 6:49 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దుర్మరణం

  • హాస్టల్ కు వెళుతుండగా ప్రమాదం

 

బతుకమ్మ,నవీపేట్ : ఉన్నత చదువుల కొరకు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ కు వెళుతున్న ఓ విద్యార్థిని మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. స్థానికుల సమాచారం మేరకు 10వ తరగతి పూర్తి చేసుకున్న  తేజస్విని (16) సోమవారం నాడు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ కు తండ్రితో కలిసి వెళుతుండగా నవీపేట్ మండల కేంద్రంలో బాసర రహదారి పై జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ బాలిక తలపై నుండి వెళ్లడంతో తల ఛిద్రమై ఘటన స్థలంలోనే మృతి చెందడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Intermediate student dies in road accident