మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని చిక్లి గ్రామంలో వెంకట అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం దిమెరి వెంకట్(16) ధర్మారం మైనార్టీ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. చదువులో వెనుకబాటుతనంతో మనస్తాపం చెంది మృతి చెందినట్లు తెలిపారు. తల్లి దండ్రులు మంజుల,సాయి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.