మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి
అబద్దాలతో మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం గ్యాస్ ధరను పెంచి మహిళలపై మోదీ సర్కార్ గుదిబండను మోపింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : మహిళలకు స్వావలంభన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలకు రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ. 16.5 లక్షల మేర రుణమాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు ఇవ్వడానికి మాత్రం మనసు...