హస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
బాన్సువాడ ,బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ ఇంటర్మీడియట్ వసతిగృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అమృత (18) వసతి గృహంలోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని అమృత కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిందని వారు తెలిపారు. అమృత బుధవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిందనీ ఆ తర్వాత గమనిస్తే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు.ఈ విషయాన్ని స్థానికులు...