Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 10:14 pm Posted by : ramakrishna

10 నుండి ఇంటర్ సంస్కృతం మూల్యాంకనం ప్రారంభం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మార్చి 10వ తేదీ నుండి ఇంటర్ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ జిల్లా విద్య అధికారి కార్యాలయం లోని మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకులు వెంటనే తమ కాలేజ్ లాగిన్ ల నుండి నియామక పత్రాలను ప్రింట్ తీసుకొని పదవ తేదీన మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులను వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్  లు రిలీవ్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు. సంస్కృతం బోధించే అధ్యాపకులను వెంటనే రిలీవ్ చేయని కళాశాలల  కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ల పై ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్య అధికారి స్పష్టం చేశారు.