కామారెడ్డి, బతుకమ్మ: కళాశాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా మోటివేషనల్ తరగతుల నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల తో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టంలో గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో ఉందని, ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు క్లాస్ లకు తప్పని సరిగా హాజరయ్యే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. మోటి వేషనల్ సినిమాలను ప్రదర్శించాలని, ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలన్నారు. కళాశాలలను సబ్ కలెక్టర్ , ఆర్డీవోలు కళాశాలలను విజిత్ చేయాలన్నారు. విద్యార్థుల హాజరు విషయంలో సబ్ కలెక్టర్, ఆర్డీవో సహకారం తీసుకోవాలని ప్రిన్సిపాళ్లలకు సూచించారు. రానున్న రోజుల్లో కళాశాలలను విజిట్ చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉండేలా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తో మాట్లాడుతానని అన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సలాం, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.