Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2025, 3:33 pm Posted by : ramakrishna

మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా , మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  అన్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్ లలో మొదటి రోజు బుధవారం మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈపరీక్షలో 9230 మంది విద్యార్థులకు గాను 8863 మంది విద్యార్థులు హాజరయ్యారని, 347 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఇందులో జనరల్ గ్రూప్ లో 7786 మందికి గాను 7555 మంది హాజరుకాగా, 231 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. వొకేషనల్ గ్రూప్ లో 1444 మంది విద్యార్థులకు గాను 1308 మంది హాజరు కాగా, 116 మంది గైర్హజరయ్యారని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలకు పంపించే సమయంలో ప్రతీ విద్యార్థిని తప్పనిసరిగా పరిశీలించి పంపించాలని తెలిపారు. గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కూడా అనుమతించ కూడదని తెలిపారు. అనధికార వ్యక్తులను లోనికి పంపించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి షేక్ సలాం, తదితరులు పాల్గొన్నారు.


Inter exams should be conducted without giving room for malpractice.