అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జిగిత్యాల జిల్లా చిలుకల వాడకు చెందిన షేక్ యామీన్, ఆదిలాబాద్ జిల్లా తాటిగూడ రైల్వే స్టేషన్ కు చెందిన సయ్యద్ ఫరూక్ గతంలో 20కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన సత్యతో కలిసి బాసరలో రూమ్ కిరాయికి తీసుకుని నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు చేసేవారు. ఇదే క్రమంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసిన ఒక ద్విచక్ర...