సమన్వయంతో ఇంటర్ విద్యా బోధన జరగాలి
ప్రతిష్టాత్మకంగా 90 రోజుల ప్రణాళిక ఇంటర్ విద్యా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న నిజామాబాద్, బతుకమ్మ : ఇంటర్ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్ జిల్లాకు ఇంటర్ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన సమీక్షించారు. ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, మధ్యాహ్నం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒడ్డెన్న తనిఖీ...