26నుండి ఇంటర్ బొటనీ, జూవాలజి, కామర్స్, కెమిస్ట్రీ, హిస్టరీ మూల్యాంకనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 26వ తేదీ నుండి బొటని, జోవాలజీ,కామర్స్, హిస్టరీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాల లాగిన్లలో నిక్షిప్తం చేసినట్లు తెలియజేశారు. వెంటనే తమ అపాయింట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకొని 26వ తేదీన ఉదయం పది గంటలకు నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల వద్ద మూల్యాంకన కేంద్రంలో అధ్యాపకులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఆయా...