Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:25 pm Posted by : ramakrishna

అంబంలో సమీకృత పశువైద్య శిబిరం ఏర్పాటు

 

రుద్రూర్, బతుకమ్మ  :

 

99 రోజుల ప్రజాపాలన–ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో సమీకృత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా దూడల ర్యాలీ చేపట్టి పాడి రైతులకు ఖనిజ మిశ్రమం పంపిణీ చేశారు. అలాగే వేసవిలో పశువుల నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో సాధారణ పశువుల కేసులు 13, గైనిక్ కేసులు 5 నమోదు కాగా, 25 దూడలకు నులిపురుగుల నివారణ మందులు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డా.సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్, గ్రామ పెద్దలు, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.