Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 4:56 pm Posted by : ramakrishna

ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ కోర్సును రెగ్యులర్ చేయాలి

  • పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అత్యధిక శాతం పేద విద్యార్థులు చదువుకునే తెలంగాణ యూనివర్సిటీ లో ఐఎంబీఏ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చటం సరైంది కాదని  పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు తే యూ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ లో మెజారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని , రెంగులర్ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మార్చటం అంటేనే విద్యార్థులకు అదనపు ఆర్ధిక భారం వేస్తూ అడ్మిషన్స్ తగ్గిపోయేలా చేసి కోర్సును ఎత్తివేసే కుట్ర అని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజును పూర్తి స్థాయిలో ఇవ్వదని అన్నారు. విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ మరియు యూనివర్సిటీ అధికారుల తీరు సరైంది కాదని అన్నారు. విద్యార్థులకు సకాలంలో ట్యూషన్ ఫీజు మరియు స్కాలర్షిప్ లను విడుదల చేయాలని మరియు పి జి ఇంటిగ్రేటెడ్ విద్యారులకు  నెలకు  3000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ తే. యూ నాయకులు ప్రిన్స్,దేవిక, గౌతం రాజ్, బిందు, భారత్, అక్షయ్,తదితదిరులు పాల్గొన్నారు.