ట్రెసా ఆధ్వర్యంలో రూ . 75 లక్షల ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి ₹75,00,000/- లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా గతంలో ట్రెసా ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల కు ఇన్సూరెన్స్ చేయించారు. దానిలో భాగంగా ఈ చెక్ సోమవారం పంపిణీ చేశారు. అదే విధంగా ట్రెసా అనుబంధంగా నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంస్థ "హెల్పింగ్ హార్ట్స్" ఆధ్వర్యంలో బీడీఎస్విద్యార్థి ఓంకార్...