Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 5:54 pm Posted by : ramakrishna

ముగిసిన సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన

బతుకమ్మ,ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జగదాంబ దేవి మాత విగ్రహ ప్రతిష్టాపన నేటితో ముగిసిందని ఆలయ కమిటీ చైర్మన్ మొజిరం నాయక్ తెలిపారు.జగదంబ దేవి మాత భోగి బండార్ నిర్వహించి మోక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో పాడిపంటలతో పాటు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గాదేవి మాతాకు పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు మంగళవారం వనభోజనాలకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోజీరామ్ నాయక్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్,తాండ నాయక్ సబ్ గణేష్ నాయక్, ఆలయ కమిటీ మెంబర్లు జరుపుల రవికుమార్ నాయక్,మోహన్ నాయక్, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Installation of statue of Sewalal Maharaj concluded