న్యాల్కల్ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్టాపన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోపాల్ మండలం న్యాల్కల్ ప్రాథమిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్ర సందర్భంగా దేవి సరస్వతీ మాత విగ్రహ స్థాపన జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన మండల విద్యాధికారి గేమ్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య తో పాటు భక్తి భవన పెంపోందించుకోవాలన్నారు. పాఠశాలలో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఎల్ కిరణ్ కుమార్, భోజారామ్, ప్రధానోపాధ్యాయులు కొట్టూర్ దేవదాస్ , గ్రామ సచివాలయ కార్యదర్శి మల్లేశం , ...