Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 7:40 pm Posted by : ramakrishna

విద్యుత్ స్తంభం ఏర్పాటు

ఎల్లారెడ్డి,బతుకమ్మ : చాల సంవత్సరాల నుండి ఉన్న సమస్యను పరిష్కరించిన  ఎమ్మెల్యే మదన్ మోహన్ కు వెలుట్ల సంతోష్ కుమార్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లారెడ్డి మండలం లోని వెల్లుట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం పై నుండి భవనానికి తాకుతూ విద్యుత్ తీగలు వెళుతున్నాయి. ఈ విషయం పై స్థానిక కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు  సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు పాఠశాల భవనానికి తాకుతూ వెళ్తున్న విద్యుత్ తీగలకు ప్రత్యేక స్తంభాన్ని ఏర్పాటు చేసి, భవనానికి తీగలు తాగకుండా సమస్యను పరిష్కరించారు. చాలా రోజుల నుండి ఉన్న సమస్యను ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో సమస్య పరిష్కారమైనందున గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.