కిరాణా షాపులలో ప్లాస్టిక్ కవర్ల తనిఖీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజాంబాద్ నగరంలో శనివారం గంజిలో జయలక్ష్మి టాకీస్ వద్ద గంజి కమాన్ మున్సిపల్ అధికారులు సానిటరీ సూపర్వైజర్ సాజిత్, సానిటరీ ఇన్స్పెక్టర్ నూరి ప్రశాంత్ కిరాణా షాపులలో ప్లాస్టిక్ కవర్ల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అశ్వక్ కిరాణా షాపులో తనిఖీలు జరపగా  ప్లాస్టిక్ కవర్లు అధిక మొత్తంలో లభ్యమయ్యాయి. దీంతో షాపు యజమానికి 10000 రూపాయల జరిమానా విధించారు.