అభి స్కూల్‌లో విద్యాశాఖ అధికారుల తనిఖీలు
. . . అనుమతుల్లేని 9,10వ తరగతి క్లాసులకు సీజ్ బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని అభి ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 9, 10 తరగతులపై మండల విద్యాధికారి చందర్ చర్యలు చేపట్టారు. పాఠశాలను పరిశీలించిన ఎంఈవో 9, 10 తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం అనుమతులు లేని తరగతి గదులను సీజ్ చేశారు.ఇదిలా ఉండగా, పాఠశాల యాజమాన్యం టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ...