Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 7:28 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట సామాజిక  ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య సమన్వయ అధికారి డాక్టర్.పి.పెంచలయ్య  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డాక్టర్ పెంచలయ్య సిబ్బంది  హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.ఆసుపత్రిలో లభిస్తున్న ఓ.పి, ఐ.పి, ల్యాబ్ మరియు ఫార్మసీ సేవలను పరిశీలించి  వైద్య సిబ్బందిని ప్రశంసించారు.  ఈ సందర్భంగాహాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి వారికి లభిస్తున్న వైద్య సేవల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమ త్థంగా ఉంటూ దవాఖాన కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని సూచించారు. వీరితో పాటు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్.కే.రఘు, డాక్టర్.టి.ప్రదీప్ కుమార్, డాక్టర్ సి ఎచ్. ఓంకార్, నర్సింగ్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ.నాగరాజు, జూనియర్ అసిస్టెంట్లు జె.వినయ్ కుమార్, బి.రంజిత్  తదితరులు పాల్గొన్నారు.

Inspection of Yellareddypet Community Health Center