డ్రైడే,ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా నీటి కుళాయిల తనిఖీ

బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం డ్రైడే,ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా రాంపూర్ పల్లె దవఖాన సూపర్వైజర్ శాంతిశ్రీ,సిబ్బంది గ్రామంలోని నీటి కుళాయిలను తనిఖీ చేసి నీటి నిల్వ లేకుండా చూడాలని గ్రామ ప్రజలకు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నీటి కుళాయిలలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని నీరు నిలువ ఉంటే దోమల బెడద వస్తుందని దానివల్ల డెంగ్యూ,మలేరియా తదితర వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అంబికా,పెంటమ్మ,ఆశా కార్యకర్తలు మంగా,భూలక్ష్మి,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పల్లె దవాఖానలో జిపి సిబ్బందికి వైద్య...