Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 5:47 pm Posted by : ramakrishna

డ్రైడే,ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా నీటి కుళాయిల తనిఖీ

బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం డ్రైడే,ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా రాంపూర్ పల్లె దవఖాన సూపర్వైజర్ శాంతిశ్రీ,సిబ్బంది గ్రామంలోని నీటి కుళాయిలను తనిఖీ చేసి నీటి నిల్వ లేకుండా చూడాలని గ్రామ ప్రజలకు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నీటి కుళాయిలలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని నీరు నిలువ ఉంటే దోమల బెడద వస్తుందని దానివల్ల డెంగ్యూ,మలేరియా తదితర వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అంబికా,పెంటమ్మ,ఆశా కార్యకర్తలు మంగా,భూలక్ష్మి,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

పల్లె దవాఖానలో జిపి సిబ్బందికి వైద్య పరీక్షలు

పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని పల్లె దవఖానలో రాంపూర్(కలన్),కుర్తి గ్రామ పంచాయతీ సిబ్బందికి డెంగ్యూ,మలేరియా,బిపి,షుగర్,హెచ్పి గ్రామపంచాయతీ సిబ్బందికి టెస్టులను చేయడం జరిగిందని సూపర్వైజర్ శాంతిశ్రీ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాంపూర్(కలన్) గ్రామపంచాయతీ సెక్రటరీ భాస్కర్,ఏఎన్ఎం లు పెంటమ్మ,అంబిక,ఆశ కార్యకర్తలు మంగ,భూలక్ష్మి,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Inspection of water taps as part of Tuesday and Friday program