నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పీజీ పరీక్షా కేంద్రాన్ని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తెలంగాణ వర్సిటీ మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ బిక్నూర్, గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజాంబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్, ఎస్ ఆర్ ఎం కె గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆరతి, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య యం అరుణ అడిషనల్ కంట్రోలర్ డా.బి సాయిలు, వైస్ ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2253 మంది విద్యార్థులకు 2140 మంది విద్యార్థులు హాజరయ్యారు. 113 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1739 మంది విద్యార్థులకు1665 మంది విద్యార్థులు హాజరయ్యారు 74 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.