రైతు మహోత్సవం ఏర్పాట్ల పరిశీలన

లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం నిజామాబాద్, బతుకమ్మ  :  జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పరిశీలించారు. ఈ రైతు మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల  కొనసాగే ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరై వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. సహజసిద్ధమైన...