Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 4:57 pm Posted by : ramakrishna

బాలికల సాంఘీక సంక్షేమ హాస్టల్ తనిఖీ

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని పోచంపాడు గ్రామంలో గల బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. హాస్టల్లోనే వంటగదిని, స్టోర్ రూమ్ లో ఉన్న కురకగాయాలు,బియ్యం, ఇతర సామాగ్రిని  పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మాట్లాడారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా పోచంపాడు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అర తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వారు రికార్డులను పరిశీలించి, సమయపాలన పాటించాల్సిందిగా వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ప్రిన్సిపల్ గోదావరి వైస్ ప్రిన్సిపాల్ రమణారెడ్డి, వైద్యధికారి డాక్టర్ రాకేష్, సిబ్బంది ఉన్నారు.

Inspection of Social Welfare Hostel for Girls