Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 6:50 pm Posted by : ramakrishna

అన్నాసాగర్ లో పారిశుధ్య పనుల పరిశీలన

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండంలోని అన్నాసాగర్ గ్రామంలో పారిశుధ్య పనులను బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు తో కలిసి ఇంచార్జి ఎంపిడివో ప్రకాష్ పరిశీలించారు.శానిటేషన్ కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో మురికి కాలువల పూడికతీత పనులను ఆయన పరిశీలించారు.పూడిక తీసిన చెత్తను సిబ్బంది డంపింగ్ యార్డ్ కు తరలించారు.తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలనీ సిబ్బందికి ఆయన సూచించారు. గ్రామ కార్యదర్శి తోట రాజు, సిబ్బంది పాల్గొన్నారు.