ఎల్లారెడ్డి 2వ వార్డులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పనుల పరిశీలన

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, 2వ వార్డ్ కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేశ్వరి మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వార్డు ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా రెండవ వార్డులో...