Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 7:37 pm Posted by : ramakrishna

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లింగారెడ్డి పేట, వెల్లుట్ల, వెల్లుట్లపేట, అన్నసాగర్, అజామాబాద్ పీపీసీ సెంటర్ లను ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీయనుకోవాలని సూచించారు. సెంటర్ల వద్ద మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలని, తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని ఆదేశించారు. రికార్డులు పరిశీలించారు. రైతులకు వారి కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

Inspection of paddy procurement centers