Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 7:25 pm Posted by : ramakrishna

రోప్ వే కొరకు ఖిల్లా రామాలయం పరిశీలన

 

. . . పర్వతమాల పథకం అమలుకు అడుగులు

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రతిపాదనతో కదిలిన యంత్రాంగం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాష్ట్రంలోనే చారిత్రక కట్టడమైన ఇందూరు ఖిల్లా రామాలయ అభివృద్ధి కి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి ఖిల్లా రామాలయ అభివృద్ధికి పర్వతమాల పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రధానంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 180 కోట్లతో రోబోవే తో పాటు అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి అడుగు వేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు మంగళవారం ఖిల్లా రామాలయాన్ని పరిశీలించారు. దేశంలోనే ప్రముఖ రోప్ వే కంపెనీ అయిన సీఆర్ఎస్ ప్రతినిధులు ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. మోనో కేబుల్, బై కేబుల్, జిగ్ జాగ్, ట్రై కేబుల్ ఉంటాయని, ఇక్కడి పరిసరాలకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. ఆర్అండ్ బీ డీఈ మోహన్, రోబ్ వే కంపెనీ ప్రతినిధి తన్మయ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

Inspection of Khilla Ramalayam for the ropeway project