ఖండెబల్లార్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండలంలోని ఖండెబల్లార్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల పురోగతిని తెలుసుకొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, వారి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను కూడా త్వరితగతిన మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో...