బతుకమ్మ, వేల్పూర్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లు పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీలకు 53 లక్షల 50 వేలు రూపాయలతో సి ఆర్ ఆర్ నిధులతో పనులు చేయాలని ప్రపోజల్స్ పంపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వేల్పూర్ పిఆర్ఏఈ శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు