Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2024, 1:02 pm Posted by : ramakrishna

దెబ్బతిన్న పంటల పరిశీలన

వర్ని, బతుకమ్మ:  వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను మండలంలోని జాకోర శివారులో కిసాన్ కాంగ్రెస్ ఇన్ చార్జి శనిగరం కిషన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గఫార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. పది రోజుల్లో చేతికందే దశలో ఉన్న వరి గురువారం రాత్రి కురిసన వర్షాల కారణంగా దెబ్బతిన్నదన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు  కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Inspection of damaged crops