Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 6:08 pm Posted by : ramakrishna

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పంట పొలాల పరిశీలన

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరవరం గ్రామంలో గౌరారం గ్రామంలో గురువారం నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించారు. గౌరారం గ్రామంలో ఏఈఓ లు చేసిన పంట నమోదును సిబిఎఫ్ అప్ ద్వారా వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా వరి పంటలో వచ్చే చీడపీడల గురించి రైతులకి అవగాహనా కల్పించారు. రైతులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. రైతులు ఎప్పటికప్పుడు పంటలలో వచ్చే మార్పులను వెంటవెంటనే ఏఈఓ లకు ఏవో కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. అనంతరం ఏవోలు పై స్థాయికి నివేదిక తరగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వారి వెంట మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ,వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ మరియు రైతులు పాల్గొన్నారు.