ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాల లోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను సంబంధిత సబ్జెక్టు పై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న పనికి రాని...