Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 1:20 pm Posted by : ramakrishna

ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి, బతుకమ్మ :

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.  కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు.

 

Inspecting Collector, Government Art and Science College అనంతరం ఎన్.సి.సి. విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాల లోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను సంబంధిత సబ్జెక్టు పై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న పనికి రాని స్క్రాప్ ను నిబంధనల మేరకు తొలగించాలని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ గదిలో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, బోధన అంశాలపై ప్రిన్సిపాల్ కే.విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వేంట ఆర్డీఓ రంగనాథ్ రావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, లెక్చరర్స్ పాల్గొన్నారు.

Inspecting Collector, Government Art and Science College