పవర్ హౌస్ లో విచారణ
ఆదిలాబాద్ ఎపిటిఎస్ ఆధ్వర్యంలో.. ఇందూర్, బతుకమ్మ: పవర్ హౌస్ లో కొన్ని విభాగాలలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఆదిలాబాద్ ఎపిటిఎస్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో తిరగాల్సిన కొందరు, సంఘ నాయకుల సహకారంతో నిజామాబాద్ కాంపౌండ్ లో తిష్ట వేసారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్న సహోద్యోగులు, లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా ఆకాశరామన్న లేఖ ద్వారా కంపెనీ సిఎండికి పంపినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని ఆదిలాబాద్ ఎపిటిఎస్ అధికారులకు ఆదేశాలు రావడంతో ...