Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 4:18 pm Posted by : ramakrishna

మోపాల్ పోలీసుల వినూత్న ఆలోచన

  • యువతను డ్రగ్స్, చేడు అలవాట్లకు దూరం చేసేందుకు క్రికెట్ టోర్నీ అభినందనీయం
  •  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

మోపాల్, బతుకమ్మ : కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు మోపాల్ పోలీసులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఇతరులకు ఆదర్శమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు.  ఈసందర్భంగా టోర్నీలో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… మొపాల్ పోలీస్ స్టేషన్ వారి సరికొత్త ఆలోచనతో యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మొగుపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెసిడెంట్ పాఠశాల మైదానం లో 13 గ్రామాల నుండి 13 టీంలను ఏర్పాటు చేసి ” కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ” భాగంగా యువత డ్రగ్స్ చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్

Innovative idea of ​​Mopal police

టోర్నమెంట్ కార్యక్రమాన్ని మొపాల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించారు. యువకులకు  మీరందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని, ఆటలో స్పూర్తిని చూపినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలి. ఈ రోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోంది. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. యువత దేశ భవిష్యత్తు మీరు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి. మిమ్మల్ని వ్యసనాల నుంచి దూరంగా ఉంచి సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయి.మన బాధ్యతలు మనమే గుర్తించాలి. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలి. మీరు చేసిన ప్రతి మంచి పని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని గర్వపడేలా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి, సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేష్ కుమార్, మొగుపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జెడ్.సుస్మిత, 13 క్రికెట్ జట్ల యువత, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Innovative idea of ​​Mopal police