డీఎస్సీలో మాదిగ అభ్యర్థులకు అన్యాయం

నిజామాబాద్, బతుకమ్మ: ఎస్సీ వర్గీకరణ అమలుకాకుండానే డీఎస్సీ ఫలితాలు ప్రకటించడంతో మాదిగ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం నల్లజెండాలో నిరసన తెలిపారు. అంతకు ముందు గౌతంనగర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివచ్చారు. ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మూడు దశాబ్ధాలుగా రాజీలేని పోరాటం...