మోర్తాడ్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా నందిగుట్టకు చెందిన లారీ డ్రైవర్ షేక్ రహమాన్ (42) దొన్కల్‌లో మేసన్ పనికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 26 అర్థరాత్రి అల్లేపు రాజుతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవలో అల్లేపు రాజు కర్రతో దాడి చేయగా రహమాన్ మైకంలోకి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఉదయం108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై రహీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొన్నం సత్యనారాయణ తెలిపారు.