ఇందల్వాయి, బతుకమ్మ:
జాతీయ రహదారిని దాటుతున్న చిరుత కారు డికోని గాయపడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దగ్గి ఆటవి ప్రాంతంలో చోటు చేసుకుంది. కామారెడ్డి రిజర్వు ఆటవి ప్రాంతంలోని కల్వరాల బీట్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈఘటనలో గాయపడిన చిరుత చనిపోయింది లేనిది తెలియ రాలేదు. ఆటవి ఆధికారులు మాత్రం చిరుతకు ప్రమాధం జరిగిన విషయం వాస్తవమని తెలిపారు. సంబంధిత రిజర్వు ప్రాంతంలో చిరుత ల సంచారం అధికంగా ఉంది. ఆటవి అధికారులు జాతీయ రహదారి ప్రాంతంలో సూచికల బోర్డును ఎర్పాటు చేసిన తరుచు వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ప్రమాధం జరిగిన విడియోలు, పోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతున్నాయి.
