మున్నూరుకాపు కార్పొరేషన్ కోసం మౌన దీక్ష
బతుకమ్మ, మాచారెడ్డి: మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం మాచారెడ్డి మండల కేంద్రంలో ఆ సంఘం ప్రతినిధులు మౌన దీక్ష చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా నాయకులు రావుల ప్రభాకర్, గ్రామ అధ్యక్షుడు ముదాం నర్సింలు ఆధ్వర్యంలో నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా మున్నూరు కాపులు తగిన ప్రాధాన్యతకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఇచ్చిన హామీని విస్మరించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమకిచ్చిన హామీ ని నెరవేర్చాలని కోరారు....