ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యువమోర్చ జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దందా, స్కాలర్‌షిప్ విడుదలలో నిర్లక్ష్యం వంటి సమస్యలు...