Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 5:47 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

  • బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యువమోర్చ జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దందా, స్కాలర్‌షిప్ విడుదలలో నిర్లక్ష్యం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.  ప్రైవేట్ విద్యా సంస్థలు డొనేషన్ పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.  పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాదు జిల్లాలో అనుమతులు లేకుండ కొన్ని విద్య సంస్థలు తోక పేర్లు తగిలించి నడుస్తున్నాయని, జిల్లా డీఈఓ పాఠశాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్, పల్నాటి కార్తీక్, మండల అధ్యక్షులు సాయి కుమార్, సురేష్, ప్రశాంత్, విఫుల్ రావు, మండలాల నాయకులు,జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Infrastructure should be provided in government schools